రేపు వైసిపి శాసనసభాపక్ష సమావేశం

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 04:35 PM
 

     గుంటూరు : శనివారం ఉదయం 10 గంటలకు వైసిపి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో జగన్‌ ను సభా నాయకునిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తాడేపల్లిలోని వైసిపి ప్రధాన కార్యాలయానికి కొత్తగా ఎన్నికైన వైసిపి ఎంఎల్‌ఎ లను పార్టీ కార్యాలయం ఆహ్వానించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న వైసిపి... ఇక ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా శాసనసభాపక్ష సమావేశం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, కేబినెట్‌ ప్రకటనకు అవసరమైన తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 30 న జగన్‌ ముఖ్యమంత్రిగా విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మంత్రివర్గాన్ని జగన్‌ ప్రకటిస్తారు. వైసిఎల్‌సి సమావేశం, సిఎం గా ప్రమాణ స్వీకార తేదీలతో పాటు కేబినెట్‌ లో ఎవరెవరు ఉండాలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.