రాష్ట్రపతి కోవింద్‌ను కలవనున్న మోదీ

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 04:21 PM
 
హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం కలవనున్నారు. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కోవింద్‌తో మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామాను రాష్ట్రపతికి మోదీ సమర్పించనున్నారు. మోదీ రాజీనామాను ఆమోదించిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించనున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 353, యూపీఏకు 92 స్థానాలు రాగా, ఇతరులు 97 స్థానాల్లో గెలుపొందారు. 2014లో వారణాసి నుంచి గెలుపొందిన మోదీ.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు 353 స్థానాలు రావడంతో.. రెండోసారి మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.