ఈనెల 30న మోదీ ప్రమాణం

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 02:44 PM
 

ఈనెల 30వ తేదీన నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈమేరకు నిర్ణయం జరిగినట్లు భావిస్తున్నారు. తనను 4లక్షలకు పైగా ఆధిక్యంతో గెలిపించిన వారణాసికి ఆయన 28న వెళతారు. ఆ తరువాత స్వరాష్టమ్రైన గుజరాత్‌కు 29న వెళతారని సమాచారం. కాగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి అగ్రరాజ్యాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌లను ఆహ్వానించ అవకాశాలు ఉన్నాయి. అలాగే జపాన్, జర్మనీ, ఇజ్రాయిల్ దేశాలతో పాటు యూఏఈ, సౌది అరేబియా వంటి ఇస్లామిక్ దేశాలను, సార్క్ దేశాధినేతలను కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. పొరుగుదేశమైన పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ను ఆహ్వానించాలా వద్దా అనేది ప్రధాని నిర్ణయం తీసుకుంటారు.