టీడీపీపై 12లక్షలు బెట్టింగ్‌.. ఓడినందుకు ఆత్మహత్య

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 02:27 PM
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమితో కంఠమనేని వీర్రాజు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరిలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో ఘటన జరిగింది. ఆత్మహత్యకు బెట్టింగే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. టీడీపీ గెలుస్తుందని వీర్రాజు రూ.12లక్షలు పందెం కాశాడు. గురువారం వెలువడిన ఫలితాల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడటంతో బెట్టింగ్‌లో పెట్టిన డబ్బులను అతడు కోల్పోయాడు. దీంతో నిరాశకుగురైన వీర్రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు సన్నిహితులు పేర్కొన్నారు.