జగన్‌ సీఎం కావాలన్నది నా బలమైన కోరిక

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 02:15 PM
 

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల్లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆఖండ విజయం సాధించడంతో నటుడు పోసాని కృష్ణమురళి సంతోషం వ్యక్తం చేశారు. అమీర్‌పేట్‌ కనకదుర్గమ్మ ఆలయంలో పోసాని ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ గెలవాలని దేవుళ్లందరికీ మొక్కుకున్నా. ప్రజాతీర్పు చూసి చంద్రబాబు మనసు మారి ఉంటుందని అనుకుంటున్నా. జగన్‌ సీఎంగా గెలవడంతో ఏపీకి మంచి రోజులు వచ్చాయి. ప్రజలకు మంచి పాలన అందించి జగన్‌ మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సీఎం కావాలని కూడా గతంలో దేవుడిని కోరుకున్నా.. జగన్‌ సీఎం కావాలన్నది నా బలమైన కోరిక. అందుకే మొక్కులు తీర్చుకున్నా, కష్టాలను అధిగమించి..జీవితంలో మంచి స్థితికి చేరుకున్నా. ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా ఉన్నా. అని పోసాని పేర్కొన్నారు.