మంత్రుల పేషీల్లో మార్పులు

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 02:13 PM
 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా అధికారం చేపట్టనున్న నేపథ్యంలో సాధారణ పరిపాలనా శాఖ సచివాలయంలోని మంత్రుల పేషీల వద్ద పాత మంత్రుల నేమ్‌ పేట్లను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు మంత్రుల నేమ్‌ ప్లేట్లను తొలగించారు. అలాగే మంత్రుల పేషీల్లోని పాత సిబ్బందిని వారి వారి మాతృసంస్థలకు తిప్పి పంపనున్నారు. కొత్తవారిని ఆయా స్థానాల్లో భర్తీ చేయడానికి కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను తొలగించారు.