ఎపికి హోదా కోసం పోరాటం : ఎంపి మిథున్‌ రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 12:31 PM
 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని ఎంపి మిథున్‌ రెడ్డి అన్నారు. పోలవరం, అమరావతికి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామన్నారు. భారీ మెజారిటీ ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా జగన్‌ పాలన ఉంటుందని ఆయన చెప్పారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు.