సత్తా నిరూపించుకున్న స్టాలిన్‌

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 12:08 PM
 

చెన్నై : డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. స్టాలిన్‌ తండ్రి, డిఎంకె వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం తరువాత జరిగిన ఎన్నికల్లో స్టాలిన్‌ అన్నీ తానే అయి పార్టీని ముందుకు నడిపించారు. కాంగ్రెస్‌తో జత కట్టిన డిఎంకె తమిళనాడులోని 38 పార్లమెంటు సీట్లకుగాను 36 సీట్లలో విజయం సాధించింది. తద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న స్టాలిన్‌కు నిరాశే మిగిలింది. మిత్రపక్షమైన కాంగ్రెస్‌ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం డిఎంకె ప్రతిపక్షానికే పరిమితం కావలసి వచ్చింది.