ఉరవ‌కొండ నుంచి నెగ్గిన ప‌య్యావుల‌ కేశవ్

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 11:55 AM
 

హైద‌రాబాద్‌: అనంత‌పురం జిల్లాలో ఉర‌వ‌కొండ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థి ప‌య్యావుల‌ కేశ‌వ్ గెలుపొందారు. ఇవాళ ఉద‌యం ఆ ఫ‌లితాన్ని వెల్ల‌డించారు. వైఎస్ఆర్‌సీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వై విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై కేశ‌వ్ 2132 ఓట్ల తేడాతో నెగ్గారు. ఈవీఎంలో స‌మ‌స్య‌లు రావ‌డంతో ఉర‌వ‌కొండ‌లో కౌంటింగ్ ప్ర‌క్రియ ఆల‌స్య‌మైంది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు దొర‌క‌లేదు. అయితే ఇవాళ ఉద‌యం 5 గంట‌ల‌కు ఫ‌లితాన్ని ప్ర‌క‌టించారు. ఉర‌వ‌కొండ నుంచి ఏ పార్టీ గెలుపొందినా..ఆ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌ద‌న్న సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ వ‌ర్కౌటైంది.