చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా జోషి నియామకం

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 11:49 AM
 

రాష్ట్రంలో అఖండ విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భద్రత కోసం ఏపీ పోలీసు శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. ఈనెల 30వ తేదీన జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అమర్లపూడి జోషిని పోలీసు శాఖ నియమించింది. దీంతో జోషి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.