వైఎస్ జగన్‌కు టీటీడీ ప్రధాన అర్చకుల ఆశీస్సులు

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 11:44 AM
 

గుంటూరు:  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆశీస్సులు అందించింది. తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వచ్చి టీటీడీ ప్రధాన అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులతో పాటు జగన్‌ నివాసానికి వచ్చి టీటీడీ ఈవో శుభాకాంక్షలు చెప్పారు.