పాతికేళ్ల ఆర్థికాభివృద్ధికి శ్రీకారం చుట్టనున్న మోడీ

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 11:42 AM
 

వాషింగ్టన్‌ : భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మరొకసారి పదవి చేపట్టడం పట్ల అమెరికాలోని కార్పొరేట్‌ వర్గాలు హర్షం వెలిబుచ్చాయి. రానున్న ఐదేళ్లలో మోడీ భారత ఆర్థికాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని ఆశిస్తున్నట్లు ఒక ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ అధినేత అన్నారు. ప్రధాని మోడీకి శుభాకాంక్షలు. మోడీ నాయకత్వంలో వచ్చే ఐదేళ్ల పదవీ కాలంలో పాతికేళ్ల భారత ఆర్థికాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు అని యుఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ ఫోరమ్‌ (యుఎస్‌ఐఎస్‌పిఎఫ్‌) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌ జాన్‌ ఛాంబర్స్‌ అన్నారు.