అద్వాణీ, జోషిల ఆశీస్సులు తీసుకున్న ప్రధాని మోదీ

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 11:21 AM
 

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధినేత అమిత్ షా ఈ ఉదయం బీజేపీ అగ్రనేతలు అద్వాణీ, మురళీ మనోహర్ జోషిలను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. బీజేపీ నేడు విజయం సాధించిందంటే ఇటువంటి గొప్ప వ్యక్తులు దశాబ్దాల తరబడి పార్టీ పటిష్టతకు వేసిన పునాది వల్లే సాధ్యమైందన్నారు. ప్రజలకు తాజా సైద్ధాంతిక కథనాలను వివరించారు. డా. మురళి మనోహర్ జోషి గొప్ప పండితుడు. మేథోసంపత్తి కలిగిన వ్యక్తి. జోషి తోడ్పాటు భారతీయ విద్యా ఉన్నతికి ఎంతో దోహదపడింది. బీజేపీని బలోపేతం చేసేందుకు ఎల్లప్పుడు పనిచేశారు. నాలాంటి ఎంతోమంది కార్యకర్తలకు మార్గదర్శకుడిగా నిలిచారని ప్రధాని పేర్కొన్నారు.