ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక దఫా ఎంపీగా గెలవడమే కాదు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. మరోవైపు పూసపాటి రాజవంశ వారసుడిగా ప్రజల్లో ఆదరాభిమానాలున్నా పంకా స్పీడు కు గజపతి రాజులు తలవంచక తప్పలేదు. తలపండిన అశోక్ ముందు తేలిపోతాడని అంతా అనుకున్న బెల్లాన చంద్రశేఖర్. అనూహ్యంగా అశోక్ గజపతిపై గెలుపొందడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎంపీ అభ్యర్ధిగా బెల్లాన పేరును జగన్ ప్రకటించగానే అశోక్‌ని ఎదుర్కొనే సామర్థ్యం అతడికి ఉందా అని పెదవి విరిచిన వారే ఇప్పుడు బెల్లాన సాధించిన విజయాన్ని చూసి ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి కానీ కోటల్లో ఉన్న పాలకులను కలిసి మీ సమస్యలు చెప్పుకోవడం సాధ్యం కాదని, అదే సామాన్య వ్యక్తిగా మీలో ఒకడిగా ఉండి అందరికీ అందుబాటులో ఉంటానంటూ బెల్లాన చేసిన ప్రచారం ప్రజల్ని బాగా ప్రభావితం చెందారని చెప్పక తప్పదు. దీనికి తోడు కాపు కులం ఓ కాపు కాయటం కూడా బెల్లానకు కలసి వచ్చిందనే చెప్పాలి.