నిన్న డిఎస్పీకి సెల్యూట్ చేసిన చేతితో నేడు....

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 11:46 PM
 

ఖాఖీ సింహాన్ని త‌ట్టిలేపితే రాజ‌కీయాల‌లోకి వ‌చ్చి ఏం చేయాలో అదే చేసి తీరుతుంద‌నేందుకు ఉదాహ‌ర‌ణ గోరంట్ల మాధవ్. అనంతపూర్ సీఐగా పనిచేస్తూ.. స్థానిక ఎంపీ గా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి  మాట విరుపుద‌నానికి నొచ్చుకుని, తిరిగి  సవాల్ విసిరిన  వ్యక్తిగా వార్తల్లోకెక్కిన మాధ‌వ్‌... అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విష‌యం తెలిసిందే. మాధ‌వ్‌ని జెసి బ్ర‌ద‌ర్స్‌ని ఓడించేందుకు అస్త్రంగా వాడిన జ‌గ‌న్ ఆత‌నిని హిందూపురం ఎంపీగా బ‌రిలోకి దింప‌డంతో ఇటీవ‌ల జ‌రిగిన పోలింగ్‌లో భారీ మెజార్టీతో గెలుపొందారు. సీఐగా పనిచేస్తున్న సమయంలో తన పై అధికారి డీఎస్పీకి సెల్యూట్ చేసిన ఆ మాధవ్, ఇప్పుడు ఎంపీగా ఎన్నికై అదే డీఎస్పీనుంచి సెల్యూట్ తీసుకున్నాడు. ఈ అరుదైన సంఘటన కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగింది.