గెలిచి... స‌త్తా చాటిన గోరంట్ల‌

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 11:27 PM
 

 మరోసారి విజయం సాధించి ప్రత్యర్థికి తానేంటో  చూపించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య ప్రత్యర్థిగా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల వీర్రాజు బరిలో నిలిచారు. రాష్ట్రమంతా వైకాపా గాలి, రూరల్ పరిధిలో కాపు సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తల నడుమ గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృఢ సంకల్పంతో ముందుకు సాగడంతో ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఒక సీనియర్ నాయకునిగా 5,6 పర్యాయాలు ఏకధాటిగా గెలుపు సాధిస్తూ పార్టీకి ఎన్నుదన్నుగా నిలిచారు. ప్రజా సమస్యలపై సావధానంగా చర్చించి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించారు. దానికి ప్రతిరూపమే ఈనాటి విజయమని ఆయన అన్నారు.