భ‌వాని విజ‌యం వెనుక‌...

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 11:23 PM
 

తెలుగుదేశం పార్టీ తరపున రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ అనూహ్య ప‌రిణామాల నడుమ గెలుపొందారు. ఆమెతన సమీప అభ్యర్ధి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ రాజ‌కీయ నేత అయిన‌ రౌతు సూర్య ప్రకాశరావుపై 32 వేల భారీ మెజార్టీతో గెలుపొంద‌టంపై ఆమె అభిమానుల‌లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఎన్నికల కౌంటింగ్‌లో మొదటి నుండి ఆధిక్యత కనబరుస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 


మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు క షి, ఆదిరెడ్డి కుటుంబం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల సందించడం వల్లే ప్రజలు ఆ కుటుంబానికి అండగా నిలిచి గెలిపించారని,  కింజరాపు ఎర్రన్నాయుడి ముద్దు బిడ్డగా, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే ఆదిరెడ్డి కుటుంబం కోడలిగా ఆదిరెడ్డి భవానీ విజయం సాధించడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉండటమే కాకుండా… భవానీ ఛారిటబుల్‌ ట్రసు ్ట ద్వారా ఈ కుటుంబం చేయని సహాయం లేదు. లేదు అనకుండా ఏ సహయార్ధుడిని వెనక్కి పంపిన దాఖలాలు లేవు. పేద విద్యార్ధులకు ఫీజులు, పలువురికి వైద్య ఖర్చు సహాయం అందించడం… ఇలా అనేకం ఆమె ట్ర‌స్టు సొంతం. ఇక  ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించారు. అలాగే ఆదిరెడ్డి వీరరాఘవమ్మ రాజమహేంద్రవరం తొలి మహిళా మేయర్‌గా నరగపాలక సంస్థకు ఎన్నికై ఐదేళ్లు నగర ప్రజలకు చేసిన సేవ అజరామం. ఇక భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)కు యువతలో మంచి పేరుంది. అందరితో కలుగోపుగా మాట్లాడడం, ప్రేమగా పలుకరించడం, ప్రతి ఒక్కరితో మర్యాధగా మసులుకోవడం ఆయన నైజం. ఇవన్నీ ఆదిరెడ్డి భవానీకి బలం చేకూర్చాయని  చెప్పాలి.