29న ప్ర‌ధాని మోడీ ప్ర‌మాణ స్వీకారం

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 11:15 PM
 

ప్ర‌ధాని మోడీ మ‌రోమారు ఆ పద‌విని అలంక‌రించేందుకు ముహుర్తం ఖ‌రారైంది. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో ఎన్‌డియే కూట‌మి మెజార్టీ స్ధానాలు కైవ‌సం చేసుకున్న నేప‌థ్యంలో ఈనెల 29న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు బీజెపి వ‌ర్గాలు చెప్పాయి. ఈమేర‌కు ఢిల్లీలో ఏర్పాట్లు చేస్తున్న బిజెపి నాయకులు  చెప్పారు. కాగా ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా  రష్యా అధ్యక్షుడు పుతిన్ నిప్ర‌ధాని ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. కాగా త‌న‌ను గెలిపించిన కాశీ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు ప్ర‌ధాని ఈనెల 28న వారణాసికి వెళ్ల‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెప్పాయి.