తమిళనాడులో ఖాతా తెరువ‌ని బీజేపీ!

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 09:04 PM
 

దేశం మొత్తం సునామీ సృష్టించిన బీజేపీ తమిళనాడులో బీజేపీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. మోదీ సునామీ తమిళనాడులో ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. ఇక, పార్టీలో సమన్వయ లేమితో కొట్టుమిట్టాడుతున్న అన్నాడీఎంకే అసలు సోదిలోనే లేకుండా పోయింది. మరోవైపు, స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే మాత్రం దుమ్మురేపింది. కాంగ్రెస్, విదుతలై చిరుథైగల్ కచ్చి (వీసీకే), సీపీఐ, సీపీఎంలతో కూడిన కూటమి 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
అన్నాడీఎంకే థేని, చిదంబరం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఈ రెండు స్థానాల నుంచి ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, పి. చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఇక, బీజేపీ నుంచి పోటీ చేసిన ఐదుగురు అభ్యర్థులు 20 వేలకు పైగా ఓట్ల తేడాతో వెనకబడి ఉన్నారు. కన్యాకుమారిలో కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ రాధాకృష్ణ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.వసంతకుమార్‌ కంటే 40 వేలకు పైగా ఓట్లతో వెనకబడి ఉన్నారు.