మంగళగిరిలో ఓట‌మి పాలైన నారా లోకేష్‌!

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 08:56 PM
 

సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేతలు వాళ్లు. కష్టాల్లో ఉన్న తమ పార్టీలనూ విజయతీరాలకు చేర్చిన దిగ్గజాలు. ఒకరేమో మూడు సార్లు సీఎంగా పనిచేశారు. మరొకరేమో రెండో సారి సీఎంగా కొనసాగుతున్నారు. అయితే వారి వారసులను విజయ తీరాలకు చేర్చడంలో తడబడ్డారు. ఒకరేమో సీఎం కేసీఆర్, మరొకరేమో టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో టీఆర్‌ఎస్, టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు కుప్పం నుంచి అత్యధిక మెజార్టీలో గెలుపొందారు. అయితే లోకేష్‌ను గెలిపించుకోవడంలో ఆయన తడబడ్డారు. ఉత్కంఠభరితంగా జరిగిన మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల్లో లోకేష్‌పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5372 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.