వైఎస్ జగన్ కు, మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప‌వ‌న్‌!

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 08:50 PM
 

ఈరోజు ఎన్నికల ఫలితాల్లో జనసేన ఒక్క స్థానంలో కూడా గెలవలేదు.  అధ్యక్షుడు పవన్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.  కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకొచ్చిన పవన్ ముందుగా గెలిచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మరోసారి ప్రధాని కానున్న మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం మాట్లాడుతూ పూర్తిస్థాయి మెజారిటీ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీని అభ్యర్థించారు.  క్లీన్ పాలిటిక్స్ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన తన మీద నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపి తాను ఓడిపోయినా, తన అభ్యర్థులు ఎవరూ గెలవకపోయినా ఇచ్చిన మాట ప్రకారం చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజాసమస్యల మీద పోరాడతామని అన్నారు.