వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఘ‌న విజ‌యం!

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 08:45 PM
 

గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని.. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌పై 18,112 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘చంద్రబాబు చుట్టూ రాజకీయ బ్రోకర్లు ఉన్నారు. మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ అడుగుజాడలో నడుస్తా. నాకు మంత్రి పదవి కావాలని నేను జగన్‌ని అడగను. జగన్ సహకారంతో గుడివాడను అభివృద్ధి చేస్తా. ఎవరైనా వైసీపీలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేసి రావాలి.’’ అని అన్నారు.