జ‌గ‌న్ ని క‌ల‌సిన‌ సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 08:41 PM
 

రాష్ట్రంలో నీతివంత‌మైన పాల‌న అందించ‌డ‌మే నా ప్ర‌ధాన ల‌క్ష్యం అని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వైఎస్. జ‌గ‌న్ తెలియచేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడుగా మాజీ సీఎస్ అజ‌య్ క‌ల్లం ను నియ‌మిస్తున్న‌ట్లు చెప్పారు. అజ‌య్ క‌ల్లాంతో క‌లిసి ప‌ని చేయాల‌ని ఎల్వీకి సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యద‌ర్శిగా ఎల్వీనే కోన‌సాగ‌మ‌ని జ‌గ‌న్ కోరారు. కాబోయే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30న ప్ర‌మాణా స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. జూన్ 1 నుండి 5 వ‌రకు స‌మీక్ష‌లు ఉంటాయన్నారు. పాల‌నలో ప్ర‌స్తుతం ఉన్న వాస్త‌వ ప‌రిస్థితుల‌పై స‌మీక్షలు చేయనున్నారు. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు జ‌గ‌న్ ను అఖిల భార‌త‌స్థాయి అధికారులు క‌ల‌వ‌నున్నారు.