మోదికి శుభాకాంక్ష‌లు తెలిపిన పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ !

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 08:33 PM
 

లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా ఎన్డీయే దూసుకుపోతుండటంతో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎన్నికల్లో విజయం సాధిస్తుండటం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి, సౌభాగ్యం కోసం మోదీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.