బీజేపీది చారిత్రాత్మకమైన విజయం: అమిత్ షా

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 08:28 PM
 

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మకమైన విజయం సాధించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 50 ఏళ్లలో పార్టీకి ఇంత మెజార్టీ రావడం ఇదే తొలిసారని తెలిపారు. తాము చేసిన పనులే తమను మరోసారి గెలిపించాయని చెప్పారు. కార్యకర్తల కష్టం, మోడీ ప్రచారం బీజేపీ విజయానికి దోహదం చేసిందన్నారు. 17 రాష్ట్రాల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించామని తెలిపారు. ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వారసత్వ, కుల రాజకీయాలకు స్వస్తి పలుకుతామని చెప్పారు. విపక్షాల కుట్ర రాజకీయాలు ఫలించలేదన్నారు. విపక్షాల ఐడియాలజీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోడీపై ఆరోపణలను దేశ ప్రజలు తిరస్కరించారని తెలిపారు.