ఏపీ ఎన్నికల ఫలితాలలో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో వైకాపాలో సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లిలోని జగన్ నివాసంలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. తన నివాసంలో ఫలితాల సరళిని గమనిస్తున్న జగన్ ను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి హత్తుకుని అభినందించారు. ఏపీలో వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలలో వైకాపా ప్రభంజనం కొనసాగుతుండటంతో వైకాపా శ్రేణులు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందం పంచుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా వైకాపా విజయం పట్ల సంబరాలు చేసుకున్నారు.