భోపాల్ : మధ్యప్రదేశ్ లోని ఓ కార్ల షోరూంలో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బెతుల్ లోని ఓ కార్ల షోరూంలో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద సంఖ్యలో కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఆస్తినష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.