ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మంత్రివర్గంలో కొత్త వారి వ్యక్తిగత వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 03, 2017, 12:58 AM

( అమరావతి- సూర్య ప్రధాన ప్రతినిధి ):ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న 11 మంది మంత్రుల విద్యార్హత, వయసు, వారు అధిరోహించిన పదవుల వివరాలు ఇలా ఉన్నాయి.


పేరు : నారా లోకేష్‌, విద్యార్హతలు ఎంబీఏ


వయసు : 34, స్వస్థలం : నారావారిపల్లె, చిత్తూరు జిల్లా


* ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇటవల శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు.


పేరు : భూమా అఖిలప్రియ, విద్యార్హత, బీబీఎం


వయసు : 28, స్వస్థలం  ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా


* 2014 సాధారణ ఎన్నికల ముందు ఎమ్మెల్యే అఖిలప్రియ తల్లి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అనంతరం అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి ఇటీవలే కన్నుమూశారు.


పేరు : కాల్వ శ్రీనివాసులు, విద్యార్హత ఎం.ఏ సోషియాలజీ


వయసు : 53, స్వస్థలం : కె.కె అగ్రహారం, అనంతపురం


* 1999 వరకు 14 సంవత్సరాలపాటు ఈనాడు పాత్రికేయుడిగా పనిచేశారు. 1999-2004 వరకు అనంతపురం ఎంపీగా ఉన్నారు. 2000-2003 మధ్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. 2014లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలపొంది శాసనసభ లో చీఫ్‌విప్‌గా ఉన్నారు.


సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, విద్యార్హత, డిగ్రీ


వయసు : 60, స్వస్థలం : అల్లీపురం, నెల్లూరు జిల్లా


* 1994, 1999లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలపొందారు. యువజన సర్వీసులు, సమాచార, ప్రసార శాఖల మంత్రిగా పనిచేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా వ్యవహరించారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.


పితాని సత్యనారాయణ, విద్యార్హత, బీకామ్‌


వయసు : 64, స్వస్థలం కొమ్ము చిక్కాల, పశ్చిమగోదావరి జిల్లా


* 2004, 2009 ఎన్నికల్లో ఆచంట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆరోగ్యశ్రీ, సాంఘీక సంక్షేమ శాఖ, రహదారులు, భవనాల శాఖ ఇన్‌ఛార్జి మంత్రిగా పనిచేశారు. 2014లో ఆచంట నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ నైతిక విలుల కమిటీ సభ్యునిగా ఉన్నారు.


కిమిడి కళా వెంకట్రావు, విద్యార్హత, బీఏ, బీఎల్‌


వయసు : 63, స్వస్థలం : రేగిడి, ఆముదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా


* 1983, 1985, 1989, 2004 ఎన్నికల్లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1998-2004 మధ్య రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. గతంలో పురపాలక, వాణిజ్యపన్నుల, హోం శాఖ మంత్రిగా పనిచేశారు. టీటీడీ ఛైర్మన్‌గా సేవలు అందించారు. 2014లో ఎచ్చెర్ల శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.


పేరు : నక్కా ఆనంద్‌బాబు, విద్యార్హత : బీఏ, బీఎల్‌


వయసు : 50, స్వస్థలం : కొల్లిపర మండలం, సిరిపురం, గుంటూరు జిల్లా


* 2009, 2014లో వేమూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. శాసనసభ మైనారిటీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 1987లో తెలుగు విద్యార్థి సంఘం, తెలుగు యువత అధ్యక్షునిగా, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.


పేరు : చదిపిరాల ఆది నారాయణరెడ్డి, విద్యార్హత : ఎమ్మెస్సీ


వయసు : 58, స్వస్థలం : దేవగుడి, జమ్మల మడుగు, కడప జిల్లా


* కళాశాల అధ్యాపకునిగా పనిచేశారు. 2004, 2009, 2014లో జమ్మలమడుగు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.


పేరు : నూతన కాల్వ అమరనాథరెడ్డి, విద్యార్హత : బీకాం


వయసు : 62, స్వస్థలం : కెళవాతి, పెదపంజాని మండలం, చిత్తూరు జిల్లా


* పుంగనూరు ఎమ్మెల్యేగా రెండుసార్లు, పలమనేరు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలిచారు. డీసీసీబీ ఛైర్మన్‌గా, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షునిగా, జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.


 ఆయన తండ్రి రామకృష్ణారెడ్డి మూడుసార్లు పుంగనూరు ఎమ్మెల్యేగా, మూడుసార్లు చిత్తూరు ఎంపీగా గెలుపొందారు. అమరనాధరెడ్డి 2012లో టీడీపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరి పలమనేరు నుంచి గెలచి 2016లో మళ్లీ టీడీపీలోకి వచ్చారు.


పేరు : కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌, విద్యార్హత : బీఏ, బీఈడీ


వయసు : 51


* ఉపాధ్యాయుడిగా, ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో కొవ్వూరు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.


పేరు : రావు వెంకట సుజయ కృష్ణ రంగారావు, విద్యార్హత : బిఏ


వయసు : 46, స్వస్థలం బొబ్బిలి, విజయనగరం


* 2004, 2009, 2014 ఎన్నికల్లో బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com