ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్ స్టాగ్రామ్ ఉపయోగిస్తున్న చింపాంజీ

international |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2019, 03:29 PM

సోషల్ మీడియా నెట్ వర్క్ తమకే సొంతం అని విర్రవీగుతున్న వాళ్లంతా ఇంక ఆ మాట పక్కన పెట్టేయాలి. ఒక చింపాంజీ అత్యంత సులువుగా ఫోటో షేరింగ్ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ ను బ్రౌజ్ చేస్తున్న వీడియో చూసినవాళ్ల మైండ్ బ్లాంకయ్యేలా చేస్తోంది. ట్విట్టర్ లో వైరల్ గా మారిన వీడియోలో భారీ కోతి ఎప్పటి నుంచో అలవాటున్నట్టుగా మొబైల్ ఫోన్ పట్టుకొని చకచకా ఇన్ స్టాను వాడేస్తూ కనిపిస్తోంది. ఇదంతా తనకు మామూలే అన్నట్టుగా ఇన్ స్టా ఫీడ్ ను చూసుకుంటున్న చింపాంజీని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


ఏదో పైకి కిందికి స్క్రోల్ చేస్తే పర్లేదనుకొనేవాళ్లేమో.. కానీ ఈ చింపాంజీ ఫోటో అండ్ వీడియో షేరింగ్ యాప్ ఆసాంతం ఔపోసన పట్టేయడం చూసి అంతా షాకవుతున్నారు. ఫోటోలు తీయడం, ప్రొఫైల్స్, వీడియోలు చూడటం వగైరా అన్నీ చక్కగా నావిగేట్ చేస్తోంది. ఫోటో, వీడియో లింక్ ఓపెన్ చేసి దానిని లైక్ చేస్తోంది. మనుషుల్లాగే తన రియాక్షన్ ఇస్తోంది. 


ఒక నిమిషం నిడివి ఉన్న ఈ క్లిప్ ను మొదట ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. కానీ ఇది మరో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ రెడ్డిట్ లో వైరల్ గా మారింది. ఆ తర్వాత అది ట్విట్టర్ కి కూడా పాకి విపరీతంగా వైరలవుతోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com