ఢిల్లీలో ధర్నాకు సన్నద్ధం : లంకా దినకర్

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 03:26 PM
 

అమరావతి: ఎన్నికల సంఘంపై ఢిల్లీలో ధర్నాకు సన్నద్ధమవుతున్నామని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్..‘మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్’గా మారిపోయిందన్నారు. న్యాయ వ్యవస్థనూ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వారణాసిలో మోడీ నామినేషన్ వ్యవహారం వీడ్కోలు వేడుకను తలపించిందని వ్యాఖ్యానించారు. వీవీ ప్యాట్లపై జాతీయ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు విజయం సాధించారని అభిప్రాయపడ్డారు.