త‌ప్పు చేస్తే నా ఇంట్లోనూ ఐటీ దాడులు చేయండి : ప‌్ర‌ధాని మోదీ

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 03:20 PM
 

హైద‌రాబాద్‌: ఒక‌వేళ తానేమైనా త‌ప్పు చేస్తే, ఆదాయం ప‌న్ను శాఖ అధికారులు నా ఇంట్లోనూ దాడులు చేయాల‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు చేస్తున్న దాడుల‌పై ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేస్తున్నాయ‌న్నారు. రాజ‌కీయ క‌క్ష‌తో నేత‌ల ఇండ్ల‌పై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని, చ‌ట్టం ప్ర‌కార‌మే ఆ సోదాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఇవాళ ఉద‌యం వార‌ణాసిలో నామినేష‌న్ వేసిన త‌ర్వాత ఆయ‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సిద్ధిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. క‌రెంటు బిల్లుల‌ను త‌గ్గిస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీ .. చివ‌ర‌కు క‌రెంటు స‌ర‌ఫ‌రానే త‌గ్గించింద‌ని విమ‌ర్శించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌త ప్ర‌భుత్వం క‌న్నా కాంగ్రెస్ పార్టీ త‌క్కువ విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేస్తోంద‌న్నారు.