ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ది గ్రేట్ ఖలీ

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 02:59 PM
 

కోల్ కతా: రింగ్ లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే రెజ్లర్ ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) ఇపుడు ప్రచార బాట పట్టాడు. ఖలీ తన స్నేహితుడు అనుపమ్‌ హజ్రా కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అనుపమ్ హజ్రా జాదవ్ పూర్ లోక్ సభ స్థానం బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇవాళ జాదవ్ పూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల్లో అనుపమ్ హజ్రాతో కలిసి ఖలీ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. తన స్నేహితుడు అనుమప్ కు మద్దతుగా నిలవాలని ప్రజలను ఖలీ కోరాడు. ఈ సందర్భంగా తమ అభిమాన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీతో కరచాలనం చేసేందుకు జనాలు పోటీ పడ్దారు.