పుష్కర నీటిని తక్షణమే విడుదల చేయాలి : జ్యోతుల నెహ్రూ

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 02:24 PM
 

జగ్గంపేట : తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట మెట్ట ప్రాంతంలో చెరువులు నీటి వనరుల అడుగంటాయని పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తక్షణమే విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులను డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మీడియా సమావేశం ద్వారా అధికారులను డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎండల ప్రతాపం ఎక్కువగా ఉన్నందున పశువులకు, పక్షులకు నీటి కరువు ఏర్పడిందన్నారు. అలాగే జలాశయాల్లో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. చెరవుల్లో నీటిని నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, వ్యవసాయంపై ఆధారపడి ఉన్న మెట్ట ప్రాంతంలో పశువులకు పుష్కలంగా నీరు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితిలో పది రోజులపాటు పుష్కరిణి నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని ఆయన కోరారు.