రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 02:16 PM
 

ప్రకాశం :  రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐరన్‌ లోడ్‌తో చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీని ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తున్న పార్శిల్‌ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌, అందులోని మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను గుంటూరుకు చెందిన భువనచంద్ర, సతీశ్‌గా పోలీసులు గుర్తించారు. ఆటోలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.