ఓటముల్లో కోల్‌కతా డబుల్ హ్యాట్రిక్ !

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 12:51 PM
 

సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల యువ హిట్టర్ రియాన్ పరాగ్ (47: 31 బంతుల్లో 5x4, 2x6), జోప్రా ఆర్చర్ (27 నాటౌట్: 12 బంతుల్లో 2x4, 2x6) చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత దినేశ్ కార్తీక్ (97 నాటౌట్: 50 బంతుల్లో 7x4, 9x6) శతక సమాన ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.