కలెక్టర్‌ కార్యాలయం చేరుకున్న మోడీ

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 11:34 AM
 

వారణాశి : ప్రధాని నరేంద్రమోడీ వారణాశిలో కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు.  ప్రధాన నరేంద్రమోదీ కాసేపట్లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. వారణాసి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆయన కాశీ విశ్వనాథ్ ఆలయం, బాబా కాల భైరవ ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు నేతలు ఉన్నారు. మోదీ నామినేషన్ నేపథ్యంలో, బీజేపీ ప్రముఖ నేతలు వారణాసి చేరుకున్నారు. వీరందరితో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.