డివైడర్‌ను ఢీకొట్టిన కారు

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 10:30 AM
 

రంగారెడ్డి: శంషాబాద్‌కు సమీపంలోని తొండపల్లి రైల్వే పైవంతెన వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. బెంగళూరు జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారు షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.