హైవేకు అడ్డుగా ఉన్న మ‌సీదును మ‌రో ప్ర‌దేశానికి తరలింపు

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 09:27 AM
 

అస్సాంలో రెండు అంత‌స్తుల మినార్ మ‌సీదును అధికారులు మ‌రో చోటుకు మారుస్తున్నారు. నాగావ్‌లోని జాతీయ ర‌హ‌దారి 37పై ఈ మ‌సీదు ఉన్న‌ది. అయితే ఆ ర‌హ‌దారిని ప్ర‌స్తుతం ఫోర్‌లేన్‌గా విస్త‌రిస్తున్నారు. దీంతో రెండంత‌స్తుల మీనార్‌ను మ‌రో చోటుకు మార్చాల్సి వ‌చ్చింది. వాస్తు శిల్పులు చ‌రిత్రాత్మ‌క‌ ఆ మినార్‌కు ఎటువంటి న‌ష్టం జ‌ర‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా మ‌రో ప్ర‌దేశానికి త‌ర‌లిస్తున్నారు. సుమారు 20 రోజుల్లో మ‌సీదును మార్చే ప్ర‌క్రియ‌ను పూర్తి చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. హ‌ర్యానా నుంచి వ‌చ్చిన హైడ్రాలిక్ మెషీన్ల‌తో మినార్‌ను త‌ర‌లిస్తున్నారు. సుమారు వంద మంది ఈ ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. పూర్తి భ‌ద్ర‌త చ‌ర్య‌లు తీసుకుని ఈ ప్రాజెక్టును నిర్వ‌హిస్తున్నారు.