నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్న మోడీ

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 09:23 AM
 

ప్రధాని నరేంద్ర మోడీ నేడు వారణాశినుంచి బిజెపి అభ్యర్థిగా తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. వారణాశి కలెక్టర్‌ కార్యాలయంలో మోడీ తన నామినేషన్‌ దాఖలు చేస్తారు. నేటి ఉదయం 11 గంటలకు వారణాశిలోని కాలభైరవ మందిరాన్ని సందర్శిస్తారు. అనంతరం 11.15 నిముషాలకు ఆయన తన నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమంలో మోడీతోపాటు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమర్తరులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, సుష్మా స్వరాజ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, శిరోమణి అకాలీదళ్‌ నేత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే తదితరులు పాల్గొంటారు. గురువారంనాడు ఇక్కడకు వచ్చిన మోడీ ముందుగా రోడ్‌షోలో పాల్గొన్నారు. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.