సీఎస్ ఓవరాక్షన్ : చినరాజప్ప

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 09:23 AM
 

తిరుమల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని పరిపాలన చేయనివ్వకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓవరాక్షన్ చేస్తున్నారని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…  ఆయణ్ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు పరిపాలనను నియంత్రించేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీపై కొంత మంది అపోహలు కలిగిస్తున్నారని.. వాటిని నివృత్తి చెయ్యవలసిన బాధ్యత అధికారులదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల అధికారులు చేసే పనిని సీఎస్ చేస్తున్నాన్నారన్నారు. పరిపాలన సజావుగా సాగాలంటే సీఎం పాత్ర ఉండాలని చిన రాజప్ప తెలిపారు.