సుజనాచౌదరికి సీబీఐ సమన్లు

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 07:48 AM
 

మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరికి సీబీఐ సమన్లు జారీ చేసింది. 2017లో ఆంధ్రాబ్యాంకును రూ.71కోట్ల మేర మోసం చేసిన కేసులో సుజనాపై సమన్లు జారీ అయ్యాయి. ఆంధ్రా బ్యాంకును మోసం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని సీబీఐ సూచించింది. ఈ నేపథ్యంలో సుజనా రేపు మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.