మ‌హిళా శ‌క్తితో టిడిపి గెలుపు త‌ధ్యం

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 12:11 AM
 

 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌లో మహిళలే   బలం గా టిడిపి విజయం తథ్యం అని మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు. గురువారం టిడిపి ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశంలో  మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకం అమలు, పోలవరం డ్యాం, పసుపు కుంకుమ, మొదలగు అభివృద్ధి కార్యక్రమాలను  దిగ్విజయంగా అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెట్టి ఓట్లు పొందాల‌ని చూసిన  ప్రతిపక్షాలు ఈ ఎన్నిక‌ల‌లో ఓట‌మి చ‌వి చూడ‌క త‌ప్ప‌ద‌ని, తాము ఓడిపోతామ‌ని తెలిసే ఇష్టానుసారంగా చంద్ర‌బాబును విమర్శిస్తున్నారని ఎద్దేవా చేసారు. నిన్న‌టి వ‌ర‌కు ఎడారి ని త‌ల‌పించిన రాయలసీమ జిల్లాలను హంద్రీనీవా ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు నాయుడు గోదావరి జలాలను తెచ్చి ఇక్క‌డి రైతాంగం  దాదాపు 30 సంవత్సరాల కల నెర‌వేర్చినందుకు ఆయ‌న‌ని ఓడించాల‌ని విప‌క్షం భావిస్తున్న‌ట్టుంద‌న్నారు. త‌ను18 సార్లు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఎన్నికలు చూశానని, అయితే 2019 ఎన్నికలు  లోపభూయిష్టంగా .రిగిన‌ట్టు ఎప్పుడూ జ‌ర‌గ‌నే లేద‌ని, అన్నింట‌ ఈసీ  విఫ‌ల‌మైంద‌ని విమర్శించారు. అదేవిధంగా ఈవీఎంలు పనిచేయకపోవడం, ఓటర్లకు సరైన సౌకర్యాలు కల్పించడం, ఎన్నికల నిర్వహిస్తున్న కేంద్రాల వ‌ద్ద‌ సరైన భద్రతా బలగాలు ఏర్పాటు చెయ్యడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఆదేశానుసారమే రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికలు నిర్వహించార‌న్న‌ది సుస్ప‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి.