విప‌క్ష నేత ప్ర‌తినిధిలా సిఎస్ : పంచుమర్తి అనురాధ

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 11:54 PM
 

 త‌మ నేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమ‌ర్శలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం  వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఉన్న‌త ప‌ద‌విలోని వ్య‌క్తి ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం విప‌క్షానికి లీకులుఇస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌న్నారామె. . సీఎస్, వైఎస్ జగన్‌, ప్రధాని మోదీకి కవల పిల్లల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎస్ ప్రతిపక్ష నాయకుడి ప్ర‌తినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్టికల్ 172 ప్రకారం ...సీఎంకు సమీక్ష చేసే అధికారం ఉన్నా సీఎస్ లేదు అని ఎలా అంటారని ఆమె మండిపడ్డారు.