ఏప్రిల్ 27న మహాసంప్రోక్షణ

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 11:50 PM
 

తిరుమ‌ల‌లోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో  శాస్త్రోక్తంగా అష్ట‌బంధ‌నం స‌మ‌ర్ప‌ణ పూర్తి కావ‌టంతో         ఏప్రిల్ 26న శుక్ర‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారికి మ‌హాశాంతి పూర్ణాహుతి, తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాల‌లో భాగంగా శ‌య‌నాధివాసం చేప‌డ‌తారు.


 ఏప్రిల్ 27న ఉదయం 11.07 నుండి మ‌ధ్యాహ్నం 1.16 గంట‌ల వ‌ర‌కు మహాసంప్రోక్షణ జ‌రుగనుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వ‌రాహ‌స్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.