టిటిడి కాల్‌సెంటర్‌ తనిఖీ చేసి అధికారులు

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 11:44 PM
 

టిటిడి పరిపాలన భవనంలోని కాల్‌సెంటర్‌ ద్వారా భక్తులకు వేగంగా సులభంగా సిబ్బంది సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన సమాచార బోర్డులను తిరుపతి జెఈవో, అధికారులతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ కాల్‌సెంటర్‌ లో టిటిడి అనుబంధ ఆలయాల సమాచారం, ఆర్జిత సేవల వివరాలు, దర్శన సమయం తదితర అంశాలతో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తిరుమలకు సంబంధించిన మ్యాప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు తిరుమలలో ఎక్కడ ఉన్నా వారికి త్వరితగతిన సమాచారం అందించేలా మ్యాప్‌లు రూపొందించాలని సూచించారు. రైళ్లు, విమాన, ముఖ్యమైన ప్రాంతాలకు బస్సుల రాకపోకల సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కాల్‌సెంటర్‌లో ఇంజినీరింగ్‌ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.   ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ -1 రమేష్‌రెడ్డి, ఇతర అదికారులు పాల్గొన్నారు.