టిడి ఉద్యోగులకు ఉన్నత ప్రమాణాలతో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం : తిరుపతి జెఈవో

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 11:41 PM
 

టిటిడి ఉద్యోగులకు ఉన్నత ప్రమాణాలతో నూతన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి ప్రచురణల విభాగం ప్రాంగణంలో ఉన్న స్థలన్ని గురువారం జెఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.    ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులకు అత్యాధునిక సౌకర్యాలతో టిటిడి ప్రచురణల విభాగం ప్రాంగణంలో ఉన్న స్థలంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు  సాధ్యాసాధ్యాలను ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో పురుషులు వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, లాన్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌, చెస్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, కబడ్డీ, మహిళలు విభాగంలో టగ్‌ ఆఫ్‌ వార్‌, బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌, క్యారమ్స్‌, చెస్‌, త్రోబాల్‌, డాడ్జిబాల్‌, కబడ్డి ఆటలు ఆడేలా నిర్మించాలన్నారు.  తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంప్రక్కన ఉన్న ఎస్వీ మ్యూజియంను పాత హూజురు ఆఫీసులోనికి మార్చెందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.