టీటీడీ ఈవో ఎవరికి భయపడుతున్నారో : రాజేంద్రప్రసాద్‌

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 11:20 PM
 

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తోందని, టీటీడీ ఖజానా నుంచి తీసుకెళ్లీ మళ్లీ అప్పగించే బాధ్యత కూడా బ్యాంకులదే  అని స్ప‌ష్ట‌మైన నిబంధ‌న‌లు ఉన్న‌ప్పుడు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఎందుకుంటుంద‌ని నిల‌దీసారు.  టీటీడీ బంగారం తరలింపుపై  తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉన్న‌ట్టు విప‌క్షాలు బిజెపి వైసిపిలు క‌ల‌సి క‌ట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బ్యాంకులు కేంద్రం ఆధీనంలో ఉన్న సంస్ధ‌ల‌ని, ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంద‌ని తెలిసి కూడా త‌ల‌రింపుకు సిద్ద‌మ‌య్యారంటే ఎదో దురుద్దేశం ఉంద‌ని   తమకు కేంద్రంపైనే అనుమానం ఉందని ఆయన అన్నారు.  ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందుకు ముఖ్యమంత్రికి   ఎలాంటి అధికారాలు లేవని సీఎస్‌ ఎలా అంటారని, పాల‌న‌ని ప‌డ‌కేయించాల‌ని సిఎస్ చూస్తున్న‌ట్టు ఉంద‌ని ఎద్దేవా చేసారు.  త‌న‌కు రావ‌లిసిన సిమ్ముల కోసం ర‌కెలేసిన మోహ‌న్ బాబుకు  తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులు చనిపోతుంటే   కనిపించడం లేదా? అని నిలదీశారు.