పుంగనూరు చింతపండు ప్రాముఖ్యత రామ్‌దేవ్‌కు తెలిపిన జ‌న‌సేన అభ్య‌ర్ధి

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 11:03 PM
 

ప్రఖ్యాత యోగా గురువు, పతంజలి ఆయుర్వేద పరిశ్రమల అధినేత శ్రీ రాం దేవ్ బాబా ని పుంగనూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  రామచంద్ర యాదవ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆయన సొంత నివాసం హరిద్వార్ లో కలిశారు .ఈ సందర్భంగా పుంగనూరు లో చింతపండు ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ పతంజలి ఆయుర్వేద పరిశ్రమ నెలకొల్పడానికి తగిన అనుకులతలను వివరిస్తూ, పుంగనూరు లో టమోటా ఎగుమతులు మరియు ఇక్కడి అనుకూల వాతావరణ పరిస్తుతులను వివరించారు.


అలాగే చుట్టు పక్కల రాష్ట్రాలకు అతి తక్కువ దూరంలో ఉన్న పుంగనూరు కు గల వ్యాపార అనుకులతలను క్షుణ్ణంగా వివరించారు. అరగంట పాటు సుదీర్ఘంగా రామచంద్ర యాదవ్ సమర్పించిన విజ్ఞప్తిని పరిశీలించిన రాం దేవ్ బాబా చాలా సానుకూలంగా స్పందించారు. అంతేకాక త్వరలోనే పుంగనూరు వచ్చి పరిశ్రమ నెలకొల్పడానికి తగిన అనుకులతలను స్వయంగా వీక్షించేందుకు సంసిద్ధత తెలిపారు.పుంగనూరు అభివృద్ధి కోసం రామచంద్ర యాదవ్ పడుతున్న తపన చూసి పుంగనూరు ప్రజలు అభినందిస్తున్నారు.