సీబీఐ నోటీసులపై కోర్టుకెళ‌తా : సుజ‌నా

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 11:00 PM
 

 " సీబీఐ నోటీసులో పేర్కొన్న కంపెనీలతో 2014 నుంచి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీల నుంచి వైదొలిగాను. సీబీఐ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తాను" అని  కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి తేల్చి చెప్పారు. త‌ను వైదొలిగిన కంపెనీల‌కు సంబంధించి ఏవిధంగా  సీబీఐ నోటీసులిస్తుంద‌ని . ఈ నోటీసుల వ్యవహారంపై  కోర్టులోనే తేల్చుకోనున్న‌ట్టు చెప్పారాయ‌న‌. బ్యాంకుల‌  వద్ద రుణాలు తీసుకుని ఎగ్గొట్ట‌డంతో పాటు  చేసిన కేసులో సీబీఐ శుక్రవారం బెంగళూరు సీబీఐ ఎదుట హాజరుకావాలని నోటిసులిచ్చిన విష‌యం తెలిసిందే.