నెల్లూరులో చిన్నారుల కోసం వేసవి శిక్షణ శిబిరం

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 09:33 PM
 

నెల్లూరు జిల్లా కేంద్ర గ్రంధాలయంలో సమ్మర్ క్యాంప్ (వేసవి శిక్షణ శిబిరం) కార్యక్రమం ప్రారంభించారు. గురువారం ఉదయం 8 ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ కిలారి వెంకట స్వామి నాయుడు, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి యం. శేఖర్ బాబు, ఉప గ్రంథపాలకులు ఎస్.సునీత మరియు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి  జిలాని భాష, జన విజ్ఞాన వేదిక నగర కమిటీ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఎ. విజయ్ కుమార్, విద్యా చరణ్ డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సీనియర్ వైద్యులు శ్రీను నాయక్,  నగర సీనియర్ నాయకుడు మరియు ఇంద్రజాలికులు ఆదినారాయణ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. పై కార్యక్రమములో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు, పాఠకులు మరియు కేంద్ర గ్రంధాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు